పోలీసులు నా భర్త నోట్లో యాసిడ్ పోసి కొట్టారు: తారా చౌదరి!
తారా చౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన భర్తను పామూరు పోలీసులు అకారణంగా కొట్టారంటూ ఆమె ఆరోపించారు. నిత్యవసరాలు, మందులు తెచ్చేందుకు తన భర్త రాజకుమార్ బయటకు వెళ్లగా పోలీసులు దుర్బాషలాడి, కొట్టారని తారా చౌదరి ఆరోపించారు. ఈనెల 23న తన భర్త నిత్యవాసరాల కోసం బయటకు వెళ్లగా పామూరు ఎస్ఐ చంద్రశేఖరరావు తన భర్తను కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకువెళ్లారన్నారు. అక్కడ తన భర్తను అనేక చిత్రహింసలకు గురిచేశారని.. అంతేకాకుండా తన భర్త నోట్లో బలవంతంగా మద్యం పోసి..
మద్యం సేవించినట్లు కేసు నమోదు చేశారన్నారు. ఒకేవేళ తన భర్త మద్యం సేవిస్తే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలి గానీ ఇలా ఇష్టమొచ్చినట్లు కొడతారా? అని తాను ఎస్ఐను అడగ్గా.. తనను కూడా న్యూసెన్స్ కేసు బుక్ చేసి జైల్లో పెడతానని అనుచితంగా వ్యాఖ్యలు చేశారని తారా చౌదరి వాపోయారు.