వైసీపీ లక్ష్యంగా పృథ్వీ సెటైర్లు.. క్షమాపణ చెప్పిన విశ్వక్ సేన్
'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్లో వైసిపి లక్ష్యంగా నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లపై హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. వేదికపై ఆయన మాట్లాడేటప్పుడు తాము లేమని, ఉండి ఉంటే వెంటనే మైక్ గుంజుకునేవాడినని తెలిపారు.
సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ 25K ట్వీట్లు వేశారని, HD ప్రింట్ రిలీజ్ చేస్తామంటున్నారని, ఒకరు చేసిన తప్పుకు మేం ఎందుకు బలికావాలి? అంటూ పేర్కొన్నారు. "పృథ్వి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. మా మూవీని చంపేయొద్దు'' అంటూ వ్యాఖ్యలు చేశారు.