రోజూ ఈ జ్యూస్ తాగితే ఒత్తైన జుట్టు మీ సొంతం..
పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగకపోగా జుట్టు రాలడం అధికమవుతుంది. మరికొంతమంది మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి తాల్కాలిక ఉపశమనం కలిగించినా పరిస్థితిలో మార్పు కనిపించదు. అయితే బీట్‌రూట్ జుట్టు సంరక్షణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ప్రతిరోజూ బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల ఒత్తైన పొడవాటి జుట్టును పొందవచ్చు. బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీసే, జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. బీట్ రూట్ లోని మెగ్నీషియం – భాస్వరం ఈ రెండు ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.