ఉదయం లేవగానే నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం లేవగానే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. కొందరు మామూలు నీళ్లు తాగితే, మరికొంత మంది వేడి నీళ్లను తాగుతారు. ఇలా ఉదయాన్నే లేచి నీరు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి...
ఉదయం లేవగానే నీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ క్రియ కూడా బాగుంటుందట. అలాగే ఉదయం కనీసం రెండు గ్లాసులు నీటిని తీసుకోవాలి. అలాగే రాత్రంతా నిద్ర పోవడం వలన చాలా గంటల పాటు నీరు అందకుండా పోతుంది. ఇలా తాగితే శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఎప్పుడైనా చర్మం డల్ గా మారినట్లు అనిపిస్తే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని వైద్యులు చెపుతున్నారు. ఇలా నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ ప్రోత్సహిస్తుందట. కొత్త కణాలు ఉత్పత్తిని పెంచడం వలన చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుందని అంటున్నారు. ఉదయం పూట మొదటగా నీళ్లు తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం నుండి బయట పడవచ్చు.
అలాగే ఉదయాన్నే నీటిని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది. ఇది మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా దరిచేరవు. మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారు ఉదయం లేవగానే నీటిని తాగితే ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా బీపి సమస్య ఉన్నవారు కూడా నీటిని తాగడం చాలా మంచిదని చెబుతున్నారు.