రోజుకొక్క గ్లాస్ చాలు!
క్యారెట్ మిగతా కూరగాయల కంటే కాస్తంత తీయగా ఉంటుంది. నిజానికి దీనిని పచ్చిగా లేదా ఉడికించి ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోలేం. కాబట్టి జ్యూస్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. రోజూ ఒక గ్లాస్ పచ్చి క్యారెట్‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం రండి...
- క్యారెట్లలో బయోటిన్, మాలిబ్డనమ్, ఫైబర్, పొటాషియం, విటమిన్-కె, బి1, బి6, బి2, సి, ఇ, మాంగనీస్, నియాసిన్, పాంటోథెనిక్ ఆమ్లం, ఫాస్ఫరస్, కాపర్… వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల్ని నిరోధిస్తాయి.
- క్యారెట్‌లోని బీటా కెరోటిన్ కారణంగా కంటి కండరాలు క్షీణించ కుండా ఉంటాయి.
- రోజూ ఓ గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే రోగనిరోధకశక్తి పెరుగు తుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది.
- పొటాషియం కారణంగా కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది, విటమిన్-కె రక్తం గడ్డ కట్టేందుకు దోహదపడుతుంది. ఈ రెండూ ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే వీటిలోని విటమిన్-సి గాయాలను త్వరగా మానేలా చేస్తుంది.
- క్యారెట్‌లోని కెరోటినాయిడ్లు యాంటీ క్యాన్సర్ కారకాలు. మూత్రాశయ, ప్రొస్టేట్, పేగు, రొమ్ము క్యాన్సర్ల బారి నుండి కాపాడుతాయి.
- క్యారెట్ రసాన్ని రోజూ తాగడం వల్ల కాలేయం పనితీరు బాగుంటుంది.అలాగే శరీరంలోని మలినాలు బయటకుపోతాయి.
- జలుబు, జ్వరం, ఫ్లూ, బ్రాంకైటిస్, అల్సర్లు, సొరియాసిస్… వంటివి రాకుండా ఉంటాయి.
- నెలసరి క్రమంగా రానివాళ్లు రోజూ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది గర్భిణీలకు ఇది చాలా మంచిదే.
- క్యారెట్‌లో బి-కాంప్లెక్స్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ వేగం పెరుగుతుంది.
- ముఖ్యంగా గర్భిణిలు రక్తహీనతతో బాధపడితే పుట్టబోయే పిల్లలు మరణించే శాతం ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది.