పొరపాటున కూడా వీరు పుచ్చకాయను తినకండి..

Lifestyle Published On : Monday, March 3, 2025 06:57 AM

వేసవి కాలం వచ్చింది. ఈ సీజన్‌లో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇప్పటికే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. పుచ్చకాయలో విటమిన్‌ A, B కాంప్లెక్స్‌, C, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి. పుచ్చకాయలో లైకోపీన్‌, బీటా - కెరోటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ పుచ్చకాయను కొందరు తినకూడదు.

పుచ్చకాయ చల్లని స్వభావం కలిగింది. దీని చల్లని స్వభావం కారణంగా వాత, కఫాలలో అసమతుల్యతను కలిగిస్తుంది. అందుకే ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయను తినకూడదు. పొరపాటున తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయకు దూరంగా ఉండాలి.