ఎండ వేడికి ఈ డ్రింక్స్ తాగితే బాడీ ఫుల్ కూల్, ఖుషీ..

Lifestyle Published On : Monday, February 17, 2025 07:23 AM

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం మార్కెట్‌లో లభించే గ్యాస్ కలిగిన కూల్ డ్రింక్స్, రసాయనాలు కలిగిన పానీయాల కన్నా, ఇంట్లోనే సహజమైన పదార్థాలతో తయారు చేసుకునే ఈజీ డ్రింక్స్ తాగడం మంచిది. ఇవి ఒంట్లో వేడిని తగ్గించడమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి.

జీలకర్ర – నిమ్మకాయ: జీలకర్ర నీటిని వేడి చేసి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనికి దాల్చిన చెక్క పొడి లేదా తేనె కలిపి తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

అల్లం – నిమ్మకాయ: నిమ్మకాయతో పాటు అల్లం కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. నిమ్మరసంలో దంచిన అల్లం, మెత్తగా చేసిన పుదీనా ఆకులు కలిపి కొద్దిగా నల్ల మిరియాల పొడి జోడించి తాగితే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనికి తేనెను జోడిస్తే ఆరోగ్యపరంగా మరింత మంచిది. ఇంకా మెరుగైన ఫలితాల కోసం నానబెట్టిన చియా విత్తనాలను కూడా కలిపి తాగవచ్చు.

నిమ్మకాయ – పుదీనా: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. చల్లని నీటిలో నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి కొద్దిగా ఉప్పు, తేనె కలిపి తాగితే శరీరానికి తక్షణమే చల్లదనం లభిస్తుంది. 

పైనాపిల్ – నిమ్మరసం: వేసవి వేడి వల్ల అలసటకు గురయ్యే వారికి పైనాపిల్ నిమ్మరసం చాలా మంచిది. నాలుగు నుంచి ఐదు పైనాపిల్ ముక్కలను నిమ్మరసంతో కలిపి బ్లెండ్ చేసి కొద్దిగా ఐస్ లేదా చల్లని నీటిని జోడించి తాగితే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. తీపి కోసం కొద్దిగా తేనె లేదా చక్కెరను వేసుకోవచ్చు. ఈ డ్రింక్ అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...