ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. రాత్రి పూట ఆలస్యంగా పడుకోవడమే దానికి కారణం. కానీ ఇలా ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మానసిక సమస్యలు 30 శాతం ఎక్కువవుతాయని అంటున్నారు.
మానసిక ఆందోళన, డిప్రెషన్, చిరాకు వంటివి వస్తాయని చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జీవ గడియారం దెబ్బ తినడం వల్ల మతిమరుపు సమస్య రావచ్చని, ఊబకాయం, షుగర్ వంటి జబ్బులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రి వీలైనంత త్వరగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేవడం మంచిదని సూచిస్తున్నారు.