ఉగాది పచ్చడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
తెలుగు సంవత్సరాది ఉగాదికి ప్రత్యేకంగా తయారు చేసే ఉగాది పచ్చడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోని ప్రతి పదార్థం ఆరోగ్యానికి మేలు చేయనుంది...
వేప పువ్వును ఆయుర్వద శాస్త్రంలో ఔషధ మూలికగా పేర్కొన్నారు. చర్మ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, మధుమేహం, మలేరియా మొదలైన వాటికి దివ్యౌషధంగా పని చేస్తుంది.
వేపను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి మామిడిని తినడం వలన రక్తనాళాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చి మామిడిని తినడం వలన గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
బెల్లం తినడం వల్ల కాలేయం శుభ్రం అవుతుంది. టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. చింతపండు జీర్ణ శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఉగాది పచ్చడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని బెల్లం, చింతపండు రసం వేసుకుని అందులో నలిపిన వేప పువ్వులు, తరిగిన మామిడి కాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కట్ చేసిన అరటి పండు ముక్కలు, తరిగిన కిస్ మిస్, బెల్లం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ.