రోజుకు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా..

Lifestyle Published On : Wednesday, February 19, 2025 07:20 AM

ఎప్పుడూ వంటింట్లో మూలిగే యాలకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాత, పిత్త, కఫాలను సమతూకంలో ఉంచడంలో తోడ్పడతాయి. జీర్ణశక్తి మొదలుకుని శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుదల వరకు అనేక రకాలుగా యాలకులు మేలుచేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 

యాలకులతో జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు యాలకులు నోట్లో వేసుకుని నమిలితే చాలు వెంటనే ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే గ్యాస్‌, ఎసిడిటీ, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు తగ్గిపోతాయిని నిపుణులు చెబుతున్నారు. యాలకులు శరీర జీవక్రియలను నెమ్మదిగా పెంచుతాయి. వీటిలో ఉండే థర్మోజెనిక్‌ గుణాలు శరీరంలో క్యాలరీలను సమర్థంగా కరిగించేస్తాయి. రాత్రివేళ యాలకులు తింటే బరువు తగ్గడానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యాలకులలో ఉండే డైయూరెటిక్‌ గుణాలు శరీరంలో పేరుకున్న మలినాలు బయటికి పంపుతాయి. అవి కిడ్నీల ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. శరీరానికి ఉన్న సహజ డిటాక్స్‌ క్రమాన్ని మెరుగుపరుస్తాయి. రాత్రి వేళ యాలకులు నమిలితే నోటి దుర్వాసన దూరమవుతుంది. దంతాలు, చిగుళ్లకు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షణ లభిస్తుంది. యాలకుల సుగంధం మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ఒక కప్పు యాలకుల టీ తాగితే శరీరంలో స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసోల్‌ స్థాయులు తగ్గుతాయి. అలా ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

యాలకులతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాక చర్మం, జుట్టు సమస్యలను కూడా నయం చేసే లక్షణాలు ఉంటాయి. యాలకుల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. దీంతో చర్మం మెరిసేలా తయారవుతుంది. యాంటి బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలపై పోరాడతాయి. యాలకుల్లో ఉండే పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. చుండ్రును కూడా తగ్గిస్తాయి.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...