ఉదయం టిఫిన్ మానేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Lifestyle Published On : Sunday, February 9, 2025 06:00 AM

వివిధ పనుల్లో బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం టిఫిన్ మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం కచ్చితంగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.