ఉదయం లేవగానే ఇలా చేస్తే మీకన్నా ఫిట్ గా ఎవరూ ఉండరు..!
ఉదయం లేవగానే ఇలా చేస్తే త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేవడం, వర్క్‌అవుట్ చేయడం వంటి అలవాట్లు.. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయని అనేక పరిశోధనలు నిరూపించాయి.
ఉదయాన్నే నిద్రలేవండి : మీరు ఉదయాన్నే నిద్రలేస్తే మీ బరువు అదుపులో ఉండటమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు త్వరగా నిద్రలేవడానికి త్వరగా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి కచ్చితంగా 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు అంటున్నారు. త్వరగా నిద్ర లేస్తే మీరు వ్యాయామం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ధ్యానం : మీ రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ధ్యానం మెరుగైన మార్గం. ఉదయం 10-15 నిమిషాలు ధ్యానం చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం సమర్థంగా పని చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.
గోరువెచ్చని నీరు : ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ గోరువెచ్చని నీరు సహాయపడతాయి.
వర్కవుట్ : సాయంత్రం చేసే వర్కవుట్‌ల కంటే ఉదయం వర్కవుట్‌లు మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు అంటున్నారు. ఉదయం వ్యాయామం చేస్తే మీ స్లీపింగ్ సైకిల్ మెరుగు పడుతుంది.