ఉదయం లేవగానే ఇలా చేస్తున్నారా.. అయితే మానేయండి..
ఉదయం లేవగానే పాటించే అటవాట్లు శారీరక, మానసిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మీరు మీ రోజును మరింత శక్తివంతంగా, చురుకుగా ప్రారంభించాలనుకుంటే కొన్ని అలవాట్లను మానుకోవడం తప్పనిసరి..
ఫోన్ వాడటం: ఉదయాన్నే ఫోన్ వాడటం ఒత్తిడికి దారితీస్తుంది. ఈ-మెయిల్స్, సోషల్ మీడియా సందేశాల ద్వారా మీరు మంచం నుంచి దిగక ముందే మీ మనసు, ప్రతికూల విషయాలతో నిండిపోతుంది.
అలారం స్నూజ్ చేయండి: సాధారణంగా ఉదయం లేవడానికి అందరూ అలారం పెట్టుకుంటారు. మోగిన తర్వాత దానిని ఆఫ్ చేసి కొంత సేపు పడుకుంటారు. మీకూ ఈ అలవాటు ఉంటే అలారం ఆపడానికి బదులు దానిని స్నూజ్ చేయండి. దీని కారణంగా కొంత సేపటి తర్వాత అది మళ్లీ మోగుతుంది.
ఒత్తిడికి గురికాకుండా : మీ రోజును హడావుడి ప్రారంభించడం వల్ల ఒత్తిడి, ఆందోళన ఏర్పడుతాయి. ఇది కొన్ని ముఖ్యమైన పనులు మరచిపోయేలా చేస్తుంది. ఒత్తిడికి గురికాకుండా మీ దినచర్యను ప్రారంభించండి. కొంచెం ముందుగా మేల్కొనడానికి అలవాటు పడండి.