పసుపు కలిపిన పాలు తీసుకుంటే...?
పసుపులో ఔషద గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే ఏదైనా గాయమైనపుడు వెంటినే పసుపు తగిలిస్తారు. అంతే కాకుండా చిటికెడు పసుపును పాలలో మరిగించి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు పసుపు కలిపిన పాలను క్రమం తప్పకుండా తీసుకోవాలంటారు.
ఒక గ్లాసుడు పాలలో ఓ స్పూన్ చక్కెర మరియు చిటికెడు పసుపు కలిపి ఓ పదిహేను నిమిషాల పాటు మరగించి, గోరు వెచ్చగా చల్లార్చి తీసుకోవాలి. పసుపు పాలతో కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే క్రమం తప్పకుండా తాగాల్సిందే..
- నిత్యం వేధించే దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పులకు పసుపు పాల మిశ్రమం చక్కటి ఉపశమం కలిగిస్తుంది.
- పసుపు పొడిలో యాంటీసెప్టిక్ మరియు యాస్ట్రింజెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకు సంభందించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
- పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం కరగటంతో సులభంగా ఊపిరి తీసుకోవచ్చు.
- ముక్కు దిబ్బడ మరియు తలనొప్పి నుండి క్షణాల్లో ఉపశమనం కలుగుతుంది.