బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మన ప్రాంతంలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో మొదలు రాత్రి వరకు రోజుకు మూడు పూటలా అన్నమే తింటారు. అన్నంలో విటమిన్ డి, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు పుష్కలంగా కలిగి ఉంటాయి. అదనంగా కాల్షియం, ఫైబర్, ఐరన్, ఇతర ఖనిజాలు కలిగి ఉంటాయి. అందువల్ల గర్భధారణ సమయంలో బియ్యాన్ని తినడం వల్ల మీ ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బియ్యాన్ని తరచుగా తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అన్నంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. బియ్యాన్ని తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అన్నం తినడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది. చాలా మంది ఉదయం వివిధ రకాల అల్పాహారం తీసుకుంటారు. అన్నం తినడం వల్ల ఉదయం తినే ఆహారం శక్తి, పోషకాలతో నిండి ఉంటుంది. అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది. అన్నం ఉదయం 7 నుండి 9 గంటల మధ్య తినాలి. ఉదయం జిమ్‌కి వెళితే, మీ వ్యాయామానికి 20-30 నిమిషాల ముందు అరటిపండు లేదా అవకాడో టోస్ట్ వంటి తేలికపాటి భోజనం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.