లవర్ కోసం 1200 కి.మీ ప్రయాణం.. చివరికి భారీ ట్విస్ట్
సోషల్ మీడియా ద్వారా మొదలైన పరిచయం ప్రేమగా మారి యువతిని 1200 కిలోమీటర్ల వరకు నడిపించింది. అయితే ఆ ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముజఫర్ పూర్ కు చెందిన 10వ తరగతి పాసైన విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు తిట్టడంతో, తన ప్రియుడిని కలవడానికి 1200 కిలో మీటర్లు ప్రయాణించి ఇండోర్ కు చేరుకుంది.
ఆ తరువాత ప్రియుడు, అతని అన్నయ్యతో కలిసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను సంప్రదించి ఆమెను తిరిగి వారికి అప్పగించారు.