పిడుగుల వర్షం.. 25 మంది మృతి
బీహార్ లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంబించింది. ఆకస్మికంగా సంభవించిన ఈ తుపాను వల్ల ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నలంద జిల్లాలోనే 18 మంది మృతి చెందినట్లు సీఎంఓ ప్రకటించింది. వీరిలో ఎక్కువగా పిడుగు పాటుకు గురై మరణించినట్టు అధికారులు వెల్లడించారు.