Breaking: రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫాంలపై రైళ్లు ఎక్కేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో పలువురు స్పృహ కోల్పోయారు.
ఈ ఘటనలో 15 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఆ రైళ్లు కూడా ప్రయాణికుల రద్దీకి సరిపోలేదని సమాచారం.