నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చింది.. కొత్త కేసుతో మళ్ళీ అరెస్ట్
వైసిపి మద్దతుదారు, నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
నిన్నటివరకు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పోసానిపై ఇంకా ఉన్న కేసుల్లో పిటి వారెంట్ ఇచ్చేందుకు పోలీసులు పోటీ పడుతున్నట్లు సమాచారం.