తెలియక చేశా: ప్రకాష్ రాజ్

News Published On : Friday, March 21, 2025 11:58 AM

బెట్టింగ్ యాప్ యాడ్ ప్రమోషన్ చేయినందుకు హైదరాబాద్ పోలీసులు పలువురు తెలుగు హీరోలు, హీరోయిన్లతో పాటు ఇన్ఫూయన్సర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ యాడ్ లో నటించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అందరినీ ప్రశ్నించే నేను.. సమాధానం చెప్పాలి కదా? అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఆ యాడ్ షూట్ 9 ఏళ్ల క్రితం 2016లో చేశానని, కొద్దిరోజులకే ఇది తప్పు అని తెలుసుకున్నానని చెప్పారు. ఆ కాంట్రాక్ట్ అయిపోయాక మళ్లీ ఎక్స్టెండ్ చేయలేదని అన్నారు. 2021లో వేరే కంపెనీ ఈ వీడియోను వాడినందుకు నోటీసులు కూడా ఇచ్చానని చెప్పుకొచ్చారు. "యువకులారా? బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండి" అంటూ విజ్ఞప్తి చేశారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...