సేవా కార్యక్రమాలకు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తా : అదానీ
సేవా కార్యక్రమాలకు రూ.10,000 కోట్లు వెచ్చిస్తానని కార్పొరేట్ దిగ్గజం అదానీ ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కుమారుడు జీత్ అదానీ-దీవా షాల పెళ్లి సందర్భంగా అదానీ ఈ మేరకు వెల్లడించినట్లు చెప్పారు.
పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారని వెల్లడించాయి. 'సేవ చేయడమే భక్తి, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ' అనేది అదానీ ఫిలాసఫీ అని పేర్కొన్నాయి.