Breaking: డీఎస్సీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

News Published On : Thursday, April 17, 2025 10:17 PM

ఏపీలో 2025 మెగా డీఎస్సీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీ 2024 జూలై 1గా నిర్ణయించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపుదల చేసింది.