జగన్ బర్త్ డే.. అల్లు అర్జున్ ఫోటోతో బ్యానర్లు: మెగా ఫ్యామిలీ టార్గెట్!
నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా జగన్ కు బర్త్ డే విషెస్ వెళ్లువెత్తుతున్నాయి. దీంతో పాటు ఆయన ఫ్యాన్స్ ఎక్కడిక్కడ బ్యానర్లు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అయితే, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ క్యాడర్ కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేసింది. అంతే కాదు, జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే బ్యానర్లో అల్లు అర్జున్ ఫోటోతో పాటు ఒక పవర్ ఫుల్ కొటేషన్ కూడా రాసుకొచ్చారు.
"రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారు" అంటూ కూటమిని ఉద్యేశించి బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బ్యానర్ కూటమిని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా లేదా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారా..?