అల్లు అర్జున్ కేసు: నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించిన 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో నేడు ఆయన కోర్టులు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆయన న్యాయవాదులు ఆన్ లైన్ ద్వారా కోర్టుకు హాజరు అవుతారని తెలపడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
అల్లు అర్జున్ ను జైలుకు తరలించిన అనంతరం హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయాన్ని లాయర్లు కోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ మీద నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణను నాంపల్లి కోర్టు వచ్చే సోమవారానికి కేసును వాయిదా వేసింది. అదే విధంగా అల్లు అర్జున్ జ్యూడిషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.