భారత్ సాయం కోరిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికా భారత్ సాయం కోరింది. నమ్మశక్యంగా లేదు కదా..అవును ఇది నిజమే. అదానీపై కేసులో అమెరికా భారత్ సాయం కోరింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై లంచం కేసులో విచారణకు సహకరించాలని భారత్ ను కోరినట్టు అమెరికా SEC వెల్లడించింది.
న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టుకు తెలిపింది. వారిద్దరూ అమెరికాలో లేరని, భారత్లో ఉన్నారని పేర్కొంది. గత ఏడాది గౌతమ్, సాగర్ పై జో బైడెన్ నేతృత్వంలోని DOJ అభియోగాలు మోపింది. వీటిని అదానీ గ్రూప్ ఖండించిన సంగతి తెలిసిందే.