ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో గురువారం సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు MSME పాలసీలో మార్పులకు నేటి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.