తిరుమల కల్తీ నెయ్యి కేసు: పోలీసుల కస్టడీకి నిందితులు
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది.
దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.