ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు
ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని, ఎప్పుడైనా సంభవించవచ్చని తెలిపింది. దీనికి 20 ఏళ్లు పట్టొచ్చు లేదా రేపే జరగొచ్చని అభిప్రాయపడ్డారు. మహమ్మారి ముప్పు మాత్రం ఖాయమని, అది జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.