HMPV వైరస్: ఏపీలో మాస్క్ తప్పనిసరి.. సీఎం చంద్రబాబు
భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.. ఈ వైరస్ 2001 నుంచి ఉన్నట్లు గుర్తు చేశారు. ముందు జాగ్రత్తగా ఆరోగ్య శాఖ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు.
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. వైరస్ టెస్టింగ్ కిట్లను సిద్దం చేసుకోవాలని తెలిపారు. వెంటనే 3 వేల టెస్టింగ్ కిట్లను తెప్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డులను సిద్దం చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు సంభందించిన మాక్ డ్రిల్స్ అన్ని ఆసుపత్రిల్లో త్వరితగతిన నిర్వంచాలని ఆదేశించారు.
వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలందరూ కనీసం 20 సెకనన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.