కుంభమేళా తొక్కిసలాట: స్పందించిన చంద్రబాబు
మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది తరలిరావడంతో అర్ధరాత్రి ప్రయాగ్ రాజ్ సెక్టార్-2 వద్ద తొక్కిసలాట జరిగి 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. కుంభమేళాలో తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.