డీఎస్సీ నోటిఫికేషన్‌ అప్పుడే : నారా లోకేష్

News Published On : Friday, January 31, 2025 10:36 PM

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది తెదేపానే అని తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు విద్యా శాఖ కమిషనర్‌ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యలు వింటున్నారని చెప్పారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు 'ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌' తీసుకొస్తున్నామని వెల్లడించారు.