ఏప్రిల్ నుండి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు
ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సౌమ్య పాల్గొని నియోజకవర్గంలోని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తాగునీటి, సాగునీరు సమస్యల గురించి అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.