అక్కడ వివరాలు ఉంటేనే సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
సంక్షేమ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పథకాలు, ఇతర ప్రయోజనాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల హౌస్ హోల్డ్ జాబితా లేదా RTGSలో వివరాల నమోదును తప్పనిసరి చేసింది.
ఆయా పథకాల అమలు, వినతుల పరిష్కార సమయంలో ఈ జాబితాలోని వివరాలు సరిపోల్చుకున్నాకే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.