ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

News Published On : Monday, January 27, 2025 03:30 PM

ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. అమరావతిలోని 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.