ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం

News Published On : Friday, January 31, 2025 10:04 PM

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఆ పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ పథకంపై ఓ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై పలు సూచనలు చేశారు.

ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ వేచి చూడాల్సిందే.