Breaking: గ్రూప్-2 పరీక్షలు వాయిదా

News Published On : Saturday, February 22, 2025 03:45 PM

ఏపీలో రేపు జరగాల్సిన గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేస్తున్నటువంటి విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్ కి లేఖ ద్వారా సూచించింది.

మరోవైపు అంతకు ముందే సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. వాస్తవానికి రేపు ఉదయం 10గంటల నుంచి 12.30 గంటలకు పేపర్ -1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ తాజాగా వాయిదా పడింది. త్వరలోనే తేదీలను ఏపీపీఎస్సీ వెల్లడించనుంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...