కడప జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం.. ఏపీ కేబినెట్ నిర్ణయం
వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ కెబినెట్ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇకపై వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించనున్నారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరు ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరులోని కడప తొలగించింది. దీంతో నాటి నుంచి వైఎస్ఆర్ జిల్లాగా వ్యవహరిస్తున్నారు.