తిరుపతి తొక్కిసలాట మృతులకి భారీ నష్ట పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

News Published On : Thursday, January 9, 2025 12:06 PM

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇప్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.