BREAKING: జగన్ పై కేసు నమోదు చేసిన ఏపి పోలీసులు
మాజీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా, గుంటూరు పర్యటనకు ఎన్నికల సంఘం నిరకరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో పర్యటించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
జగన్ తో సహా కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన మందిపై కేసు పెట్టారు.