నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్.. ఫోన్ కే సర్టిఫికెట్లు
ఎపి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. మంత్రి నారా లోకేశ్ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు చెందిన 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీ ఫోన్ నుండే ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్లు పొందడంతో పాటు పన్నులు, ఫీజులు కట్టచ్చు అన్నమాట.