అయోధ్య రామమందిర ప్రధాన పూజారి బ్రెయిన్ డెడ్
అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ (87) బుధవారం ఉదయం కన్నుమూశారు. 'బ్రెయిన్ స్ట్రోక్' కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఆయనను లక్నోలోని SGPGIలో చేర్చారు. బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు దాస్ తాత్కాలిక రామాలయ పూజారిగా ఉండేవారు.
రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిచేసిన, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్న దాస్ వయసు అప్పుడు కేవలం 20 సంవత్సరాలు. ఆయన అయోధ్య అంతటా విస్తృతంగా గౌరవం అందుకున్నారు. నిర్వాణి అఖాడకు చెందిన దాస్, అయోధ్యలో అత్యంత అందుబాటులో ఉండే సాధువులలో ఒకరు. అంతేకాకుండా అయోధ్యతో పాటు, రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై సమాచారం కోరుతూ దేశవ్యాప్తంగా అనేక మంది మీడియా వ్యక్తులకు అందుబాటులో ఉండే ఓ ప్రముఖ వ్యక్తి దాస్ . డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఆయన ప్రధాన పూజారిగా తొమ్మిది నెలలనుంచి మాత్రమే పనిచేస్తున్నారు. ఈ కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చిన భారీ రాజకీయ తిరుగుబాటుకు కారణమైంది. రామమందిర ఉద్యమం, ముందుకు సాగే మార్గంపై మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు దాస్ ఎల్లప్పుడూ ఓపికగా సమాధానాలిచ్చేవారు. కూల్చివేత తర్వాత కూడా, దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు. రామ్ లల్లా విగ్రహాన్ని తాత్కాలిక గుడారం కింద ప్రతిష్టించినప్పుడు కూడా పూజలు చేశారు.