మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్
మాంసం ప్రియులకు GHMC బ్యాడ్ న్యూస్ చెప్పింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నెల 10న గ్రేటర్ హైదరాబాద్ లోని మాంసం దుకాణాలు మూసి వేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. మాంసం దుకాణాలు 10న తెరవకూడదని GHMC కమిషనర్ ఇలంబరిది ఆదేశాలు జారీ చేశారు. మటన్, బీఫ్ తదితర మాంసం విక్రయ దుకాణాలు, కబేళాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ట్రై పోలీస్ కమిషనర్లకూ అధికారులు సమాచారం అందించారు.