తండ్రీ కొడుకులను పీక్కుతిన్న ఎలుగుబంటి
అందరూ చూస్తుండగానే తండ్రి, కొడుకులను ఎలుగుబంటి పీక్కుతున్న ఘటన ఛత్తీస్ ఘఢ్ లోని కాంకేర్ కోరర్ ఫారెస్ట్ లో చోటు చేసుకుంది. అటవీ సమీప ప్రాంతంలోని ప్రజలు కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు. ఒక ఎలుగు బంటివారికి కన్పించడంతో అటవీ శాఖ అధికారులకు వారు సమాచారం అందించారు.
ప్రజలు, అటవీ సిబ్బంది ఎలుగు బంటి కన్పించిన ప్రాంతానికి వెళ్లారు. ఇంతలో ఎలుగు బంటి కోపంతో వారి మీదకు దాడికి ప్రయత్నించింది. దాని మీద కర్రలు, రాళ్లను వేశారు. కానీ ఎలుగు బంటి అక్కడున్న తండ్రి, కొడుకులపై దాడి చేసింది. తన పదునైన పళ్లు, చేతి గోర్లుతో శరీరంను చీల్చేసింది. గ్రామస్తులు అరుపులు పెట్టిన, రాళ్లు వేసిన వదలలేదు.ఆ తర్వాత అది అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడున్న కొంతమంది తమ ఫోన్లలో దీన్ని రికార్డు చేశారు.