పెరిగిన బీర్ల ధరలు.. ఏయే బీరు ఎంతంటే..

News Published On : Tuesday, February 11, 2025 11:00 AM

తెలంగాణలో మందుబాబులకు షాక్ ఇస్తూ బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచిది. ఈ మేరకు సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఎక్సైజ్ శాఖఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పెరిగిన ధరలు మంగళవారం నుంచి అంటే ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.  

ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీరు రూ. 150గా ఉండగా స్ట్రాంగ్ బీరు రూ.160గా ఉంది. ఇప్పుడు 15 శాతం ధరలు పెరగనుండటంతో రూ.150 ఉన్న లైట్ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరగనుంది. కేసు లైట్ బీర్లు తీసుకోవాలంటే రూ. 2160 అవుతుంది. ఇక కేసు స్ట్రాంగ్ బీర్లు తీసుకోవాలంటే రూ. 2400 అవుతుంది. ఇప్పుడు పెరిగిన బీర్ల రేట్లతో ప్రతినెలా దాదాపుగా రూ.300 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయేది సమ్మర్ కావడం, దీనికి తోడు ఐపీఎల్ కూడా ఉండటంతో బీర్ల సేల్స్ మరింత పెరగనున్నాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.