వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం: సీఎం సంచలన ప్రకటన
వక్ఫ్ చట్టం అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు, నితీష్ వల్లే వక్స్ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యిందని ఆమె అన్నారు. నమ్మి ఓట్లు వేస్తే చంద్రబాబు, నితీష్ ముస్లింలను మోసం చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.