మెట్రోపై బెట్టింగ్ యాడ్స్.. వ్యక్తమవుతున్న ఆగ్రహం
హైదరాబాద్ లోని కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన ప్రయాణికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారని, ఈ మెట్రోలపై యాడ్స్ వారికి కనిపించడం లేదా అని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇందుకు ఎవర్ని బాధ్యులు చేస్తారు? ఎవరిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే వాటిని తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.