కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళ ఆరెస్ట్
తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మి వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశాన్ని ముగించుకుని వస్తున్న ఆమెను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆన్‌లైన్ మోసం కేసులో లక్ష్మిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమెును ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయల్‍పై లక్ష్మి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని కిరణ్ రాయల్‌ను జనసేన పార్టీ ఆదేశించింది. పైగా కిరణ్ రాయల్ అంశం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ మహిళతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేయడం సంచలనంగా మారింది.