ఢిల్లీ ఎన్నికలు: బీజేపీ ఘన విజయం
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగురవేసింది. దీంతో 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు పుల్‌స్టాప్ పడింది.
మాజీ సిఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ అగ్ర నేతలు ఓటమిపాలయ్యారు. మూడోసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.