ఓయోనూ బ్యాన్ చేయాలని డిమాండ్
ఓయోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. ట్విట్టర్ లో 'బాయ్ కాట్ ఓయో' హ్యాష్యాగ్ ట్రెండింగ్లో ఉంది. కుంభమేళా సందర్భంగా ఓయో సంస్థ ఇచ్చిన ఓ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అందులో 'దేవుడు అన్ని చోట్లా ఉంటాడు.. అలాగే ఓయో కూడా' అని పేర్కొనడమే ఇందుకు కారణం. దేవుడితో పోల్చడమేంటని ఓయో యాజమాన్యంపై నెటిజన్లు, హిందూ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఓయోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.