మహిళ ప్యాంట్లో పేలిపోయిన ఫోన్

News Published On : Wednesday, February 12, 2025 08:30 AM

ప్యాంట్లో పెట్టుకున్న ఫోన్ పేలి ఓ మహిళకు తీవ్రగాయాలైన ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆమె వెనుక పాకెట్లోని మోటో E2 ఫోన్ పెట్టుకుంది. భర్తతో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది.

దీంతో ఆమె వెనుకభాగం, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి. ఈ పేలుడుకు కారణాలపై విశ్లేషిస్తున్నామని మోటరోలా కంపెనీ ప్రకటించింది.